ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయడమే పనిగా పెట్టుకున్నారు

హైదరాబాద్ః టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ప్రజలకు సంబంధించి ఏ ఒక్క మంచి కార్యక్రమం చేపట్టకపోవడం దురదృష్టకరమని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజాసమస్యలకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్ష వైయస్సార్సీపీని మాట్లాడనీయకుండా అడ్డుకోవడమే ధ్యేయంగా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం బాధాకరమని అన్నారు. ఏ ఒక్క అంశాన్ని ప్రజలకు చేరకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని, ప్రతిపక్ష సభ్యులపై ఎదురుదాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. బీఏసీలో చేర్చించిన ఏ అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. 
Back to Top