బీజేపీతో పొత్తు పెట్టుకొనే ప్రశ్నే లేదు

కడప: బీజేపీ ప్ర‌త్యేక‌ హోదా ఇవ్వలేమని స్పష్టం చేసింద‌ని,  బల్లగుద్ది చెబుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనే బీజేపీతో పొత్తు పెట్టుకొనే ప్రశ్నే లేదని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.ఏపీకి ప్ర‌త్యేక‌ హోదా ఎవరు ఇస్తే వారితోనే మా పొత్తు ఉంటుందని ముందు నుంచి వైయ‌స్ఆర్‌సీపీ చెబుతోందని గుర్తు చేశారు.  ప్రత్యేక హోదా అంశం నేడు దేశవ్యాప్తంగా చర్చకు రావడానికి కారణం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలే కారణమని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. హోదా పేరెత్తితే ముగిసిన అధ్యాయమని, జైల్లో వెయ్యాలంటూ హుంకరించిన ఏపీ సీఎం చంద్రబాబు నేడు అవన్నీ మరచి వైయ‌స్ జగన్ దారిలోకి వచ్చాడన్నారు.  నిన్న వైయ‌స్ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తానని చంద్రబాబు చెప్పారు. కానీ నేడు మేమివ్వం, మేమే అవిశ్వాసం పెడతానని కొత్త రాగం ఎందుకు అందుకున్నారని చంద్రబాబును ప్రశ్నించారు.  వైయ‌స్ఆర్‌సీపీ చిత్తశుద్ధి చూసి దేశంలోని పార్టీలన్నీ ఒకతాటిపైకి వచ్చి ప్రత్యేక హోదా విషయంలో సహకరిస్తున్నాయి. కానీ ఇలాంటి కీలక సమయంలో టీడీపీ మాత్రం డొంక తిరుగుడుగా వ్యవహరించిందంటూ మండిపడ్డారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎనిమిదిసార్లు ఎన్నికలు జరిగితే అందులో ఏడు ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది మీరు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు.


Back to Top