పోలవరానికి ప్రధాన కాంట్రాక్టర్‌ బాబే


డబ్బులు పిండుకున్నాక చేతులెత్తేస్తున్న వైనం
ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఊరుకునే ప్రసక్తే లేదు
మంజునాథ కమీషన్‌ రిపోర్టు రాకుండానే తూతూ మంత్రంగా తీర్మాణం 
ప్రమాణస్వీకారం నాడు పెట్టిన 5 సంతకాల మాటేమిటి
వైయస్‌ఆర్‌ కలల స్వప్నాన్ని నీరుగారుస్తున్నారు
ప్రాజెక్టును నిర్మించే విధంగా ఒత్తిడి తీసుకువస్తాం
7న పోలవరానికి వైయస్‌ఆర్‌ సీపీ బస్సు యాత్ర

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు ప్రధాన కాంట్రాక్టర్‌ అవతారం ఎత్తి డబ్బులు పిండుకున్నాక చేతులు ఎత్తేశాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రధాన కాంట్రాక్టర్, రాయపాటి సాంబశివరావు రెండో కాంట్రాక్టర్, మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు సబ్‌ కాంట్రాక్టర్‌లు మారి పోలవరం నిధులన్నీ మింగేశారని ఆరోపించారు. చంద్రబాబు చేతులెత్తడం... కాళ్లు ఎత్తడం కాదని, పోలవరం నిర్మాణం పూర్తి చేయకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. కాపులను బీసీల్లో చేర్చేందుకు మంజునాథ కమీషన్‌ వేసి దాని నుంచి రిపోర్టు కూడా రాకముందే ఏదో తూతూ మంత్రంగా నిర్ణయాలు తీసుకొని చంద్రబాబు కొరియా పర్యటనకు వెళ్లారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏ రాజకీయ పార్టీకైనా చిత్తశుద్ధి ఉండాలని అలాంటి గుణం బాబులో లేదన్నారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర మొత్తం ప్రజలను వంచించడమేనని చెప్పారు. 1994లో సంపూర్ణ మద్య నిషేదం, రూ.2కే కిలో బియ్యం అని అధికారంలోకి రాగానే మాట తప్పాడు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని నెరవేర్చలేదు. 2014లో 5 సంతకాలు పెట్టి ప్రజలను మోసం చేశాడన్నారు. 

– 2014లో అధికారంలోకి రాగానే పెట్టిన 5 సంతకాల మాటేమిటని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, సృజల స్రవంతి పథకం, బెల్ట్‌ షాపుల నిషేదం అని సంతకాలు పెట్టి ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
– విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సి ఉన్న∙ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ముడుపుల కోసం తీసుకుందని విమర్శించారు. అడ్డగొలుగా అంచెనాలు పెంచి డబ్బులు కాజేశారని ఆరోపించారు. పోలవరం కోసం ప్రత్యేక హోదాను వదులుకున్నానని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు హోదా, పోలవరం రెండూ లేకుండా చేశారని విరుచుకుపడ్డారు. 
– పోలవరాన్ని సోమవారంగా మార్చను. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తానని చంద్రబాబూ, 2018కల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తామని అసెంబ్లీలో చెప్పిన ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమా చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రాజెక్టు విషయంలో డొంకతిరుగుడుగా మాట్లాడడం సమంజసమా అని ప్రశ్నించారు.
– పోలవరం ప్రాజెక్టు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కలల స్వప్నం అని గడికోట గుర్తు చేశారు. పోలవరానికి 20కి పైగా అనుమతులు వైయస్‌ఆర్‌ తీసుకువచ్చారన్నారు. ప్రాజెక్టు ప్రారంభ సమయంలో చంద్రబాబు అనేక ఆటంకాలు తీసుకువచ్చారని మండిపడ్డారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు దండగా అని తన పుస్తకంలో కూడా చంద్రబాబు రాసుకున్నాడన్నారు. 
– ప్రజల కోసం పనిచేస్తున్నాం.. ప్రజలకు అన్యాయం జరిగితే వెంటనే ప్రశ్నించాలి.. అలాంటప్పుడే నాయకులం అవుతాం.. స్వార్థ ప్రయోజనాల కోసం, కేసుల కోసం రాష్ట్ర ప్రజలను తాకట్టుపెట్టకూడదన్నారు. రాయలసీమ వాళ్లమంతా పోలవరం త్వరగా పూర్తి కావాలని కోరుకుంటుంటే ఆ రకంగా పరిణామాలు జరగడం లేదన్నారు. 
– చంద్రబాబు చిట్‌చాట్‌లో మాట్లాడడం కాదయ్యా.. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ మంత్రులు కలిసి పనిచేస్తున్నారు. పోలవరం నిర్మాణం పూర్తి చేసే దిశగా గట్టి నిర్ణయాలు తీసుకోకుండా ఎవరిని బలి చేయాలని చూస్తున్నారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. 
– తన స్వార్థం కోసం దేనినైనా తాకట్టుపెట్టే గొప్ప గుణం చంద్రబాబుకు ఉందని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రజలంతా హోదా సంజీవని అని గళమెత్తితే.. తన కేసుల నుంచి బయటపడడం కోసం ప్యాకేజీని అంగీకరించాడన్నారు. వైయస్‌ఆర్‌ పోలవరం రైట్‌ కెనాల్, లెఫ్ట్‌ కెనాల్‌ పనులు ప్రారంభిస్తే.. దాదాపు పూర్తయిన రైట్‌ కెనాల్‌కు పట్టిసీమ అని పేరు పెట్టి రిబ్బన్‌ కటింగ్‌లు చేస్తూ తానే కట్టినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. వైయస్‌ఆర్‌ ఆలోచనలను నీరుగారుస్తూ రైట్‌ కెనాల్‌ను కనిపెట్టినట్లుగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
– 2018 కల్లా గ్రావిటీకి నీరు ఇస్తానని చెబుతూ.. రూ. 16 వందల కోట్లతో పురుషోత్తపట్నం ఎందుకు కడుతున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. పట్టిసీమలో రూ. 5 వందల కోట్ల అవినీతి జరిగిందని కాగ్‌ కూడా చెప్పిందన్నారు. అయినా చిత్తశుద్ధి లేదు. హంద్రీనీవా, గాలేరు–నగరి వంటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిధులను దుర్వినియోగం చేస్తున్నాడన్నారు. 
– చంద్రబాబు వ్యవస్థలను ఏ విధంగా మ్యానేజ్‌ చేసుకుంటాడో అందరికీ అర్థం తెలుసన్నారు. ఓటుకు కోట్ల కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని ఏ విధంగా మ్యానేజీ చేశావో ప్రజలకు తెలుసని చెప్పారు. అనేక కేసుల్లో ఇరుక్కొని ధైర్యంగా విచారణ ఎదుర్కోకుండా స్టేలు తెచ్చుకుంటున్నాడన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశాలపై సీఎం చంద్రబాబు ముందుకు రావడం లేదన్నారు. పోలవరం, హోదా, స్టీల్‌ ప్లాంట్‌ దేనిపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపైనే ఉందన్నారు. 
– వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు 7వ తేదీన ఎంపీ, ఎమ్మెల్యేలు పోలవరానికి బస్సు యాత్ర చేపట్టామన్నారు. పోలవరాన్ని సందర్శించి ప్రభుత్వ అవినీతిని ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా చూపించనున్నామన్నారు. అదే విధంగా పోలవరం నిర్మాణ ం చేసే విధంగా ఒత్తిడి తీసుకువస్తామన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top