మాజీ వార్డు మెంబర్‌ మృతికి ఎమ్మెల్యే నివాళి

రాయచోటి రూరల్‌ : స్థానిక చెన్నముక్కపల్లె గ్రామపంచాయతీకి చెందిన మాజీ వార్డు సభ్యురాలు మరియంబీ మృతికి బుధవారం ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి నివాళులు అర్పించారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి జరగాలని ఆయన కోరారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీనివాసులు రెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షులు వెంకటేశ్వర్లు రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు సయ్యద్‌ అమీర్, దివాన్‌ సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top