వెలిగల్లు ప్రాజెక్టు వైయ‌స్ఆర్ పుణ్య‌మే

ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి
గాలివీడు : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి కృషితోనే వెలిగల్లు ప్రాజెక్టు పూర్తి అయ్యింద‌ని,  ఈప్రాంత రైతాంగానికి సాగు, తాగునీటికి వరప్రసాదమని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వైయ‌స్‌ఆర్‌ వెలిగల్లు ప్రాజెక్టు వద్ద ప్రాజెక్టు ఇరిగేషన్‌ అధికారులు ఏర్పాటు చేసిన జలసిరి హారతి కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రాజెక్టు నీటిని లిప్టు ఇరిగేషన్‌ద్వారా మిట్టగ్రామాలకు , ప్రతి ఇంటికి వెలిగల్లు జలాశయం నుంచి సాగు, త్రాగునీటిని అందించడమే తన చిరకాల అకాంక్ష అని, అందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే జలసిరి హారతి కార్యక్రమంలో ప్రజలకు తెలియజేశారు. ఈ ప్రాంత రైతులు త్రాగునీటికి, సాగునీటికి ఆశాజ్యోతిగా వెలిగల్లు ప్రాజెక్టును మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముందుచూపుతో ప్రాజెక్టును రెండు సంవత్సరాలలో పూర్తి చేసి ఆయన చేతులు మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు. హంద్రీనీవా నీటిని ప్రాజెక్టులోకి తీసుకొచ్చేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు, త్వరలో హంద్రీనీవా నీటిని వెలిగల్లు ప్రాజెక్టులోకి చేరితే ఈ ప్రాంతం ఎప్పుడూ సశ్యశామలంగా ఉండడంతో పాటు , రైతుల జీవితాలలో వెలుగు, చిరునవ్వులు చూడాలని, ఈ ప్రాజెక్టు ప్రాంతం పర్యాటక రంగంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తామన్నారు.

మత్యుకారులను ఆదుకుంటా : మత్యుకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారికి అందాల్సిన సంక్షేమ పథకాలను అందేవిధంగా చర్యలు తీసుకుంటానని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మత్యుకారులకు హామీ ఇచ్చారు. మత్యుకారుల పిల్లల చదువుల కోసం పాఠశాలలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు, వెంటనే స్పందించిన ఆయన పాఠశాల ఏర్పాటుకు దగు చర్యలు తీసుకుంటామని ఆయన వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు జల్లా సుదర్శన్‌రెడ్డి, వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు యదభూషణ్‌రెడ్డి, ఆవుల నాగభూషణ్‌రెడ్డి, ఎంపీపీ బండి చిన్నరెడ్డి, ఉపాద్యక్షులు కె.రమేష్‌రెడ్డి, ఎంపీటీసీలు దాసరి చిన్నరెడ్డి, కె.క్రిష్ణయ్య, కవిత, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు బ్రహ్మానందరెడ్డి, సగినాల శ్రీనివాసులు, డాక్టర్‌ కోట్రెడ్డి, మాజీ సర్పంచ్‌ బయారెడ్డి, ఆంజనేయులురెడ్డి, ధర్మారెడ్డి, కోఆఫ్షన్‌ మెంబర్‌ మహమ్మద్‌సాహెబ్, బాబాపకృద్దీన్, సర్పంచులు చిన్నపురెడ్డి, మహమ్మద్‌రియాజ్, ప్రాజెక్టు ఈఈ గిరి, డీఈ సురేంద్రరెడ్డి, జేఈ శివనాయక్, రైతులు పాల్గొన్నారు.  
Back to Top