బాబు అబద్ధపు హామీలివ్వొద్దనడం పెద్ద జోక్

  • ఉమ్మడిరాష్ట్రంలో ఎన్నికల హామీలిచ్చానంటూ బాబు పచ్చి అబద్ధాలు
  • తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైయస్సార్సీపీపై నిందారోపణలు
  • పచ్చచొక్కాలకే సంక్షేమం..సంక్షేమాన్ని పార్టీ పరం చేశారు
  • రాష్ట్ర విభజనకు కారకుడు చంద్రబాబే
  • తన పదవీ వ్యామోహం కోసం ప్రజలను వంచించాడు
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్ః అబద్ధపు హామీలివ్వొద్దు, చేసిందే చెప్పాలని చంద్రబాబు చిలుక పలుకులు పలకడం 2017 జోక్ ఆఫ్ ది ఇయర్ అని   వైయస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబు..తాను ఇచ్చిన వాగ్ధానాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఇచ్చినవని మాట్లాడడం దారుణమన్నారు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు లో ఫిబ్రవరిలో ఆమెదం పొందగా, విభజన గెజిట్ కు సంబంధించి రాష్ట్రపతి సంతకం మార్చి 1న జరిగిందన్నారు. విభజన అయిపోయాక చంద్రబాబు మార్చి 31న మేనిఫెస్టో  విడుదల చేశారని చెప్పారు. ఇందుకు సంబంధించి బాబు ఓ చేత్తో తెలంగాణ మేనిఫెస్టో, మరో చేత్తో ఏపీ మేనిఫస్టో చూపిస్తూ గాలి ముద్దుక్రిష్ణమనాయుడు, రావుల చంద్రశేఖర్ రెడ్డిలతో దిగిన ఫోటోలను శ్రీకాంత్ రెడ్డి ఆధారాలతో చూపించారు.  బాబును కీర్తించే పత్రికల్లో కూడ ఈఫోటో వచ్చిందని, దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతాడని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. అధికార యంత్రాంగాన్ని, వ్యవస్థలను విచ్చలవిడిగా వాడుకొని బై ఎలక్షన్ ను గెలుచుకున్నాం.. రాష్ట్రమంతా ఎన్నిక జరిగితే మన పరిస్థితి ఏంటని ఆందోళన చెందే బాబు తన నేతలతో వర్క్ షాపు పెట్టుకున్నాడని  శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.... 

2014 ఎన్నికల్లో ఓట్ల కోసం చంద్రబాబు ఇష్టమొచ్చిన హామీలు చేస్తున్నారని ఒక అతను లెటర్ రాస్తే ఎన్నికల కమిషన్ వివరణ అడిగింది. 2014 ఏఫ్రిల్ 11న మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయగలిగేవే అని బాబు సమాధానం రాశారు. ఇంత పక్కాగా తప్పు చేసి, ప్రజలను మోసం చేసి ఉమ్మడి రాష్ట్రంలో మేనిఫెస్టో ఇచ్చామన్న బాబును ఏమనాలి..?  ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బాబు ప్రజలను మభ్యపెట్టడం చేస్తుంటే ఎవరికి చెప్పాలి. ఇదేంటని తాము ప్రశ్నిస్తే ఎదురుదాడులు, నిందారోపణలు చేస్తున్నారు. వైయస్సార్సీపీ కులాల మధ్య చిచ్చుపెడుతుందని బాబు మాట్లాడుతున్నాడు. ఆ అలవాటు తమ పార్టీకి ఎప్పుడూ లేదు. చంద్రబాబు తనకున్న పదవి వ్యామోహం, దుర్బుద్ధితోనే దాన్ని ఇతరులపై ఆపాదిస్తున్నాడు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మేనిఫెస్టోలో కులాలు, మతాలకు ఏం చేయబోతున్నాడో పది పేజీల్లో ప్రకటించాడు.  బీసీలో ఉన్న కొన్ని కులాలను ఎస్సీల్లో, ఎస్టీలో చేరుస్తానని హామీ ఇచ్చాడు. ఇవన్నీ మర్చిపోయాడు.  మైనారిటీల సంక్షేమం, ఎస్టీల సంక్షేమం అన్నీ కిలిపి పది పేజీలు రాశాడు. అందరికీ హామీలిచ్చి అవేమీ నెరవేర్చకుండా కులాలు, మతాలను నీవు ఆడుకుంటూ ఇతరులపై నిందలు వేయడం సమంజసమా బాబు..? బాబు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చాలని కొంతమంది రోడ్డెక్కితే, సమాధానం చెప్పలేక దాన్ని వైయస్సార్సీపీకి అంటగడుతున్నాడు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైయ్సార్సీపీపై దాడి చేస్తున్నాడు. ఈ రకంగా ప్రజలను మోసం చేసి ఇప్పుడు అన్నీ సత్యాలే పలకాలని చిలుక పలుకులు పలుకుతున్నాడు. 

మేనిఫెస్టోలో ఇచ్చిన వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన వారెవరైనా, నేను తప్పు చేసినా శిక్షించండి అని వైయస్ జగన్ మాట్లాడితే టీడీపీ నేతలు విపరీత భాషలోకి తీసుకెళ్లారు. తన భజన వ్యవస్థలతో తప్పుదోవ పట్టించారు. ప్రజలతో అనునిత్యం ప్రజలతో మేమకమైన వ్యక్తి జగన్. రాష్ట్రం విడిపోవడానికి కారణం చంద్రబాబే. బాబు తన పదవి వ్యామోహం కోసం అమలుగానీ హామీలతో వచ్చి ప్రజలను వంచించాడు. వైయస్ఆర్ చనిపోయినప్పుడు 150మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టి వైయస్ జగన్ ను  సీఎం కుర్చీలో కూర్చోమంటే,  ప్రజల ద్వారా వస్తానని ముఖ్యమంత్రి పదవిని తిరస్కరించాడు. ఆరోజే ఒప్పుకొని ఉంటే ఆయనపై ఏ కేసులుండేవి కావు. ఆ తరువాత చంద్రబాబు కాంగ్రెస్ తో కుమ్మక్కై వ్యవస్థలను వాడుకొని ఏ తప్పు చేయకపోయినా వైయస్ జగన్ ను జైలుకు వెళ్లేందుకు కుట్ర పన్నాడు.  18 కేసుల్లో స్టే తెచ్చుకున్న ఘనుడు చంద్రబాబు. వాటిని కాదని విచారణకు పోగలవా బాబూ. చంద్రబాబు పాలనలో సంక్షేమం పచ్చపార్టీలకే పరిమితమైంది. సంక్షేమాన్ని పార్టీపరం చేశాడు.  పెన్షన్ కావాలంటే పచ్చ కండువా కప్పుకొని రమ్మంటున్నారు.  పదవీ వ్యామోహం కోసం ఉత్తరమిచ్చి రాష్ట్రాన్ని విడగొట్టించడమే గాకుండా బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. ఇకపై చంద్రబాబు ఆటలు సాగవు.  ప్రజలు అన్ని గమనిస్తున్నారు.బాబుకు తగిన గుణపాఠం చెబుతారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top