రేపటి నుంచి గడపగడపకు వైయస్సార్సీపీ

హైదరాబాద్ : చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిన వైనాన్ని రేపటి నుంచి 'గడప గడపకు వైయస్ఆర్ సీపీ' నినాదంతో ప్రజల్లోకి తీసుకు వెళతామని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు.  వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రేపటి నుంచి గడప గడపకు వైయస్ఆర్ సీపీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి చంద్రబాబు వైఫల్యాలతో పాటు అవినీతిని వివరిస్తామని బొత్స వెల్లడించారు. శుక్రవారం వైయస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని, ఆయన ఆశయ సాధనకు పాటుపడతామని బొత్స స్పష్టం చేశారు. 
 
Back to Top