టీడీపీ వైఫల్యాలను నిలదీసేలా గడపగడపకూ

ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లండి
నిరుద్యోగ యువత శాతాన్ని తగ్గించే ఉద్దేశ్యంతో చేపట్టిన పథకం
ఒంగోలులో చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైవి సుబ్బారెడ్డి
గడపగడపకూ వైయస్సార్సీపీని అడ్డుకోవాలన్న టీడీపీ యత్నాలు సాగవు

ప్ర‌కాశం జిల్లాః నిరుద్యోగ యువ‌త శాతాన్ని త‌గ్గించాల‌నే ఉద్దేశ్యంతో చేప‌ట్టిన ప్రై మినిస్ట‌ర్ ఎంప్లాయ్ మెంట్ స్కీమ్ ను ప్ర‌జ‌ల్లోకి  తీసుకెళ్ళాల‌ని వైయస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రైమ్ మినిస్ట‌ర్ ఎంప్లాయ్ మెంట్ స్కీమ్ పై చేప‌ట్టిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. కేంద్ర‌ప్ర‌భుత్వం నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి క‌ల్ప‌న‌ కోసం అనేక ప‌థ‌కాల‌ను తీసుకొచ్చింద‌ని ఆయ‌న తెలిపారు. ప్రైమ్ మినిస్ట‌ర్ ఎంప్లాయ్ మెంట్ స్కీమ్ ద్వారా సొంతంగా ప‌రిశ్ర‌మ ఏర్ప‌ాటు చేయాల‌నుకునేవారికి రూ. 50 వేల నుండి 25ల‌క్ష‌ల వ‌ర‌కూ రుణాలు మంజూరు చేస్తార‌న్నారు. 

అన్ని జిల్లాల్లో ప‌రిశ్ర‌మ‌లు స్థాపించేలా  జిల్లా ప‌రిశ్ర‌మ‌ల జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, ఖాదీవిలేజ్ క‌మిష‌న్‌, కేంద్ర‌ప్ర‌భుత్వ అధికారులు  చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.  నిరుద్యోగులకు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డానికే  ముద్రా ప‌థ‌కం, స్టార్ట‌ప్ ఇండియా, స్టాండ‌ప్ ఇండియా ప‌థ‌కాల‌ను కేంద్ర‌ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింద‌ని, వాటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళేలా చ‌ర్య‌లు  తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. గ్రామీణ విద్యుదీక‌ర‌ణలో భాగంగా  ప్ర‌ధాన‌మంత్రి ఆదేశాల ప్ర‌కారం 2018 సంవ‌త్స‌రంనాటికి పూర్తిచేయాల‌ని తెలిపారు.

గ్రామీణ విద్యుదీక‌ర‌ణ కోసం కేంద్రం నుంచి జిల్లాకు రూ. 55 కోట్లు మంజూరైంద‌ని వైవి తెలిపారు.  నిధుల ఖ‌ర్చుల వివ‌రాలు ప్ర‌భుత్వానికి అందించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీచేశామ‌న్నారు. ఎన‌ర్జీ సేవింగ్ ప్రాజెక్ట్ కింద ఎల్ఈడీ బ‌ల్బుల మార్పు త‌ప్ప‌ని స‌రి అని తెలిపారు. వ్య‌వ‌సాయ‌రంగానికి స‌క్ర‌మంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.  గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ  వైయస్సార్సీపీ కార్య‌క్ర‌మాన్ని అడ్డుకునేలా టీడీపీ ఎన్నిప్ర‌య‌త్నాలు చేసినా,  వైయస్సార్సీపీ వెన‌కడుగు వేయ‌ద‌ని చెప్పారు.  టీడీపీ వైఫ‌ల్యాల‌ను నిల‌దీసేలా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయస్సార్సీపీ కార్య‌క్ర‌మం సాగుతోంద‌ని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. 

తాజా వీడియోలు

Back to Top