ప్ర‌జా ఉద్య‌మంలా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి 
నెల్లూరు: గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మాన్ని నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జా ఉద్య‌మంలా నిర్వ‌హిస్తామ‌ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి అన్నారు. వైయ‌స్సార్‌సీపీ కార్య‌క‌ర్త‌ల నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశాన్ని ఎమ్మెల్యే కార్యాల‌యంలో నిర్వ‌హించారు. ఎన్నిక‌ల అమ‌లును టీడీపీ విస్మ‌రించ‌డాన్ని, ప్ర‌భుత్వం అవంల‌బిస్తున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వెళ్లి పార్టీ కార్య‌క‌ర్త‌లు వివ‌రిస్తార‌ని తెలిపారు. 150 రోజుల పాటు సాగే ఈ కార్య‌క్ర‌మాన్ని దివంగత నేత వైయ‌స్సార్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఈ నెల 8వ తేదీ ఉద‌యం 9 గంట‌ల‌కు వేదాయ‌పాళెం సెంట‌ర్లో ప్రారంభిస్తామ‌న్నారు. 

తాజా ఫోటోలు

Back to Top