గాలిలో దీపాలుగా ప్రజల ప్రాణాలు

లత్తవరం:

108 సర్వీసు సకాలంలో రాకపోవడం వల్ల ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేసేవారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలుగుదేశం నేత ఎర్రన్నాయుడు కన్నుమూయడానికి 108 సర్వీసు సకాలంలో రాకపోవడమే కారణమని ఆమె స్పష్టంచేశారు. మహానేత జీవించి ఉండగా ఈ అంబులెన్సు సకాలంలో ప్రమాద స్థలానికి చేరుకునేదనీ, క్షతగాత్రులను ఆదుకునేదనీ ఆమె వివరించారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారి ప్రాణాలను సైతం కాపాడలేని స్థితికి ఈ ప్రభుత్వం చేరుకుందని షర్మిల విరుచుకుపడ్డారు. మరో ప్రజా ప్రస్థానం 17వ రోజు పాదయాత్రలో భాగంగా లత్తవరంలో ఏర్పాటైన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. 108 సర్వీసుకు ఎవరైనా ఫోను చేస్తే ప్రస్తుతం డీజిల్ లేదని చెప్పడమో, సకాలంలో ప్రమాద స్థలానికి చేరురకోలేకపోవడమే జరుగుతోందని ఆమె చెప్పారు. అంతకుముందు షర్మిల ఉరవకొండ సమీపంలో హంద్రీనీవా కాలువను పరిశీలించారు.
కాలువ పనులు అయిదు శాతం పూర్తయితే ఫలితాలు రైతులు
అందుతాయన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె
ఆరోపించారు.

Back to Top