భవిష్యత్తు అంతా వైఎస్సార్సీపీదే

చిత్తూరు(కలకడ) : రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న పార్టీ ఒక్క వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మాత్రమేనని పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి అన్నారు.  కలకడలో ఆ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.  తెలుగుదేశం పార్టీలోకి వలస వెళుతున్న వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదన్నారు. సైకిల్ గుర్తుపై  గెలచినవారు కూడా అధికారం కోసమే ఆ పార్టీని అంటుపెట్టుకుని ఉన్నారన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన వారిని ప్రజలు అస్యహించుకుంటారని చింతల చెప్పారు. 

రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని ఎమ్మెల్యే చింతల ధ్వజమెత్తారు. బాబు లాగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తుత్తి హామీలు ఇవ్వలేకనే సాధ్యంకాని వాటి జోలికి వెళ్లలేదన్నారు.  అభివృద్ధి నిధులు లేక ఎమ్మెల్యేలు ప్రజలకు ఎలాంటి హామీలూ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు వంగిమళ్ల మధుసూదన్‌రెడ్డి, కలకడ  కన్వీనర్ బి.వెంకట్రమణరెడ్డి, (బాబురెడ్డి), మాజీ సర్పంచ్ గుర్రప్ప, కమలాకర్‌రెడ్డి, నీళ్ల భాస్కర్, షావత్‌అల్లీ, జిలానీ, కస్మూరిట్రేడర్స్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
Back to Top