ఆంధ్రుల భవిష్యత్తును నేలమట్టం చేసిన బాబు

విజయనగరంః ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయిన చంద్రబాబు... రాష్ట్ర ప్ర‌జ‌ల హ‌క్కుల‌న్నింటినీ కేంద్ర ప్ర‌భుత్వానికి తాక‌ట్టు పెట్టార‌ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కొల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు. బాబు తన స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం ఆంధ్రుల భ‌విష్య‌త్తును నేల‌మ‌ట్టం చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌త్యేక హోదా అంత‌సులువుగా రాద‌ని, ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై తీవ్ర‌స్థాయిలో పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంటుందని.... ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైయస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనేక సార్లు చెప్పార‌ని గుర్తు చేశారు. 

Back to Top