నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వండి

హైద‌రాబాద్‌:  ప్రొద్దుటూరు నగరాన్ని మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య పట్టి పీడిస్తున్నాయని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో నియోజకవర్గ సమస్యలను లేవనెత్తారు. పారిశుధ్య లోపం తీవ్రంగా ఉంద‌ని, దీంతో ప్ర‌జ‌లు త‌ర‌చూ రోగాల బారిన ప‌డుతున్నార‌ని  రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద‌రెడ్డి స‌భ దృష్టికి తీసుకొచ్చారు. చిన్న‌, పెద్ద అంతా తీవ్రంగా బాధ‌ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. 37.5 కోట్లతో భూగర్భ డ్రైనేజిని మంజూరు చేశారు. 5 కోట్లు వెచ్చించి కొన్ని పనులు చేశారు. తర్వాత భూగర్భ డ్రైనేజీ నిర్వహణ పని ఆగిపోయిందని రాచమల్లు తెలిపారు. ప్రస్తుతం భూగర్భ డ్రైనేజీ అంచనా వ్యయం 70 కోట్లకు చేరిందని.. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి.. పనులు తిరిగి ప్రారంభం అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. ఇటీవల దోమ కాటు వల్ల 15 మంది మరణించారని వాపోయారు. 
Back to Top