నాలుగు రాష్ట్రాలకు సమానంగా పంచాలి

విజయవాడః  స్వయం ప్రతిపత్తి గల కృష్ణా రివర్ అథారిటీ  ఏర్పాటు చేసి కృష్ణానదీ జలాలను నాలుగు రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయాలని.... వైయస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎం.వి.ఎస్. నాగిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా ఘంటసాల మండలం కొడాలి వచ్చిన సందర్భంగా నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రాజక్ట్ ల వారిగా కేటాయింపులు జరిపి, దమాషా ప్రకారం నీటిని విడుదల చేయాలని సూచించారు. కేంద్రం వైఖరితో అంతరాష్ట్ర జలయుద్ధాలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. 

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో తెలంగాణ వాదన సమర్థనీయమన్నారు. నాలుగు రాష్ట్రాల కేటాయింపులను పున:పరిశీలించాలని , ప్రాజెక్ట్ ల వారిగా  కేటాయింపులు జరగాలన్న వాదనకు మద్దతు ప్రకటించారు. కానీ తెలంగాణ ఏ నీటి కేటాయింపులు లేకుండా 120 టీఎంసీల నీటిని తరలించేందుకు పాలమూరు-రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాన్ని ఎలా చేపడుతుందని నిలదీశారు. 

To read this article in English:  http://bit.ly/23Jo2xl 

Back to Top