నిధులు గుల్ల‌... నాణ్య‌త డొల్ల‌

 • పరాకాష్టకు టీడీపీ అవినీతి
 • పుష్కర్ ఘాట్ పనుల్లో లోపించిన నాణ్యత
 • కోట్లాది రూపాయలు దండుకున్న వైనం

గుంటూరుః కృష్ణా పుష్క‌ర ప‌నుల్లో నాణ్య‌త ప్ర‌మాణాలు పాటించ‌డం లేదు. ఇసుక‌, మ‌ట్టితో ఘాట్లు నిర్మిస్తున్నారు. నామ‌మాత్రంగా కాంక్రీటు వేస్తున్నారు. మొత్తంగా కాంట్రాక్ట‌ర్ల రూపంలో టీడీపీ నేత‌లు రూ. కోట్లు ఆర‌గిస్తున్నార‌న్న విష‌యం వైయ‌స్సార్సీపీ నాయ‌కుల ప‌రిశీల‌న‌లో బ‌ట్ట బ‌య‌లైంది.  ఆళ్ల రామకృష్ణారెడ్డి,  అంబ‌టి రాంబాబు,  మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, మర్రి రాజశేఖర్ ,  మ‌నోహ‌ర్‌నాయుడు త‌దిత‌రులు పుష్కర పనులను ప‌రిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 

దోపిడీ కోసమే ఈ హడావిడిః ఆర్కే

 • చంద్ర‌బాబు ఆయ‌న కుమారుడు లోకేష్‌, మంత్రులు, కాంట్రాక్ట‌ర్లు దోచుకునేందుకే కృష్ణా పుష్క‌రాల ప‌నులు హ‌డావుడి చేస్తున్నారు.
 • నామినేష‌న్ల‌పై కోట్ల రూపాయ‌ల ప‌నులు కాంట్రాక్ట‌ర్ల‌కు, త‌మ్ముళ్ల‌కు అప్ప‌గించిన ప్ర‌భుత్వం వాటిని ప‌ర్య‌వేక్షించ‌క‌పోవ‌డం దారుణం
 • గ‌డువులోగా ఎలాగోలా పూర్తి చేయాల‌ని... ఘాట్ ప‌నుల్లో ఇసుక పోసి... పైన నామ‌మాత్రంగా పూత‌గా కాంక్రీటు వేసి దోపిడీ చేస్తున్నార‌ు.
 •  నిర్మాణ ప‌నుల్లో పాటించాల్సిన క్యూరింగ్ జాడ క‌నిపించ‌డం లేద‌ు. క‌న్సాలిడేష‌న్ చేయ‌టం లేద‌ు. దీంతో టైల్స్ వేసినా పుష్క‌రాల ప్రారంభం నాటికే పగిలిపోయే ప‌రిస్థితి నెల‌కొంద‌ి
 • ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పుష్క‌ర ప‌నులు చేస్తుంటే గోదావ‌రి పుష్క‌రాల్లో జ‌రిగిన దుర‌దృష్ట ఘ‌ట‌న పుస‌రావృతమ‌య్యే అవ‌కాశం ఉందన్న ఆందోళన కలుగుతోంది. 
 • సీఎం నివాసంపై నుంచి చూస్తే సీతాన‌గ‌రం పుష్క‌ర ఘాట్ క‌నిపిస్తుంది... క‌నీసం ఇంటి ముంగిట జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించే తీరిక కూడా బాబుకు లేదా..?

నాణ్యత లోపం..అంతా దోపిడీ మయం: మర్రి రాజశేఖర్ 
 
 • పుష్క‌ర స‌మ‌యం ముంచుకొస్తున్నా ఇప్ప‌టికి 40 శాతం ప‌నులు కూడా పూర్తి కాలేదు... 30వ తేదీ నాటికి ఎలా పూర్తి చేస్తారు..?  
 • రూ. 10 కోట్ల విలువైన ప‌నులు చేస్తున్నా శ్రద్ధ పెట్టడం లేదు. నాయకులకు, కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు తప్ప భక్తుల కోసం చేస్తున్నట్టుగా కనిపించడం లేదు.  

అవినీతిలో పోటీపడుతున్న తమ్ముళ్లుః మోపిదేవి
 • టీడీపీ స‌ర్కార్ అవినీతికి.. పుష్క‌ర ప‌నులు సైతం అడ్డుకాద‌నే స్థాయిలో దోపిడీ జ‌రుగుతుంద‌ి. 
 • పుష్కరాలు ఎప్పుడు వ‌స్తాయో తెలిసి కూడా చివ‌రి నిమిషంలో వంద‌ల కోట్లు విడుద‌ల చేయ‌డం వెనుక అంతర్యమేంటో బాబు చెప్పాలి
 • రూ.కోటి పనుల‌కు రూ. 10 కోట్లు వెచ్చిస్తూ టీడీపీ నేతలు అవినీతిలో పోటీప‌డుతున్నరు. 
 • ఏపీలో అవినీతి ప‌రాక‌ష్ట‌కు ఉదాహ‌ర‌ణ పుష్క‌ర ఘాట్ ప‌నులే. 
 • గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర‌స్థాయి వ‌ర‌కు అధికారులు, టీడీపీ నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు అవినీతికి మాకేదీ అడ్డుక‌ాదన్న తీరు క‌న‌బ‌డుతుంది.
 • ప్రతీ గడపలో బాబుపై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి.
Back to Top