యువత, విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున స్పందన

ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 దీక్ష.. యువత,  విద్యార్థుల్లో కదలిక తెచ్చింది.  రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీలు వేదికగా.. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాల
గురించి మాట్లాడుకున్నారు. కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాల మోసపూరిత వైఖరిని ఎండగట్టాలని తీర్మానించుకున్నారు.సమైక్య ఉద్యమ పురిటిగడ్డ అయిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
వేదికగా ప్రత్యేకహోదా ఉద్యమానికి జవసత్వాలు నింపేందుకు విద్యార్థులంతా ఏకమయ్యారు.
హోదా సాధించేవరకు ఏ బెదిరింపులకూ భయపడకుండా ఉద్యమాన్ని కొనసాగించాలని
తీర్మానించారు. ఎన్నో ప్రయో జనాలున్న ప్రత్యేక హోదాను ఐదు కోట్ల మంది ప్రజలు
కోరుకుంటున్నారు. ఇప్పటికే ఐదుగురు ఆత్మార్పణం చేసుకున్నారని, వారి ఆత్మశాంతికోసమైనా ఇకపై ఉద్య మించాలని నిర్ణయించుకున్నారు.కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ
వల్ల నష్టమేనని, రూ.15 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో అవతరించిన రాష్ట్రానికి ప్రత్యేక
హోదాతోనే ఆసరా దొరుకుతుందని విశాఖ విద్యార్థులు నినదించారు. ఆంధ్ర విశ్వావిద్యాలయం
ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక హోదా చర్చాగోష్టిలో ప్రత్యేక
హోదాతో రాష్ట్రానికి కలిగే లాభం, ప్రత్యేక
ప్యాకేజీ వల్ల కలిగే నష్టాలను చర్చించారు. జగన్ నిరవధిక దీక్షకు మద్దతు పలకాలని
తీర్మానించుకున్నారు.

ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర భవిష్యత్తు
సాధ్యమని ఎచ్చెర్లలోని బీఆర్‌ఏయూ వేదికగా విద్యార్థులు నినదించారు. హోదా అవసరంపై
మంగళవారం వర్సిటీలో సమావేశమయ్యారు. ఏపీ లోటు బడ్జెట్‌తో ఉందని, నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు
నిర్వహించినా నియామకాలు చేపట్టలేని దుస్థితిలో రాష్ట్రం ఉందన్నారు. టెక్కలిలోని
ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు హోదాపై చర్చించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు
ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇవ్వాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమాలు చేస్తుంటే, అధికార పక్షం అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top