పావని మృతిపై పూర్తిస్థాయి విచారణ జరపాలి

నెల్లూరు: వైయస్ఆర్ కడప జిల్లాలో నారాయణ కళాశాల విద్యార్థిని పావని మృతిపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. చదువు పేరుతో నారాయణ కళాశాల అమాయక విద్యార్థుల ప్రాణాలు బలిగొంటుందని మండిపడ్డారు. ఆత్మహత్యకు మంత్రి నారాయణ నైతిక బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో నారాయణ కళాశాలలను బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

Back to Top