ఉచిత కంటి ఆపరేషన్లు ప్రారంభించిన వైయ‌స్ జ‌గ‌న్‌గుంటూరు:  సత్తెనపల్లికి చెందిన నేత్ర వైద్యులు గజ్జల శరదారెడ్డి, నాగభూషణరెడ్డి ఆధ్వరంలో ఏర్పాటు చేసిన‌ ఉచిత కంటి ఆపరేషన్ల కార్యక్రమాన్ని వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా స‌త్తెన‌ప‌ల్లికి వ‌చ్చిన వైయ‌స్ జ‌గ‌న్‌ను గ‌జ్జ‌ల శార‌దారెడ్డి, నాగ‌భూష‌న్‌రెడ్డి క‌లిసి తాము చేప‌ట్టిన సేవ‌ల‌ను వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా వారిని అభినందించిన వైయ‌స్ జ‌గ‌న్‌..మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌చ్చాక పేద‌లు వైద్యం కోసం అప్పుల‌పాలు కాకుండా చూస్తాన‌ని, ఆరోగ్య‌శ్రీ‌ని మెరుగుపరుస్తాన‌ని హామీ ఇచ్చారు. డాక్ట‌ర్లు మాట్లాడుతూ... ఉచిత ఆపరేషన్లను జగన్‌ సీఎం అయ్యేవరకు కొనసాగిస్తామని తెలిపారు.
Back to Top