వివిధ ప్రాంతాల్లో సాగిన వేడుక‌లు


రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుక‌లు ఉత్సాహ‌భ‌రితంగా సాగాయి. పార్టీ ఆవిర్భావ వేడుక‌ల్లో వివిధ స్థాయిల్లోని నేత‌లు చురుగ్గా పాల్గొన్నారు.
గుంటూరులో...
 వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా గుంటూరులో జిల్లా అధ్యక్షులు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ పార్టీ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి, అనంత‌రం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో రోగుల‌కు పండ్లను పంపిణీ చేశారు. చంద్ర‌బాబు మోస‌పూరిత మాట‌ల‌ను చెప్పి అధికారంలోకి వ‌చ్చార‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ఇచ్చిన హామీలు నీటి ముట‌లుగానే మిగిలిపోయాయ‌ని ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు ఇచ్చిన హామీలు నెర‌వేర్చేవ‌ర‌కు వైఎస్సార్‌సీపీ నిత్యం పోరాడుతునే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. 
విశాఖ‌ప‌ట్నంలో...
జిల్లాలోని చౌడ‌వ‌రం, పెందూర్తి, విశాఖ ఈస్ట్‌, వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించి, దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లు వేసి, జిల్లాలో ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు. ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌ల‌కు దుస్తులు, వెస్ట్‌లో మ‌హిళ‌ల‌కు చీర‌లు పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్య‌క్షుడు అమ‌ర్‌నాథ్ త‌దిత‌రులు పంపిణీ చేశారు. 
శ్రీ‌కాకుళంలో...
శ్రీ‌కాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, పార్టీ జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డిశాంతి ఆధ్వ‌ర్యంలో పార్టీ జెండాల‌ను ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మాల్లో వైఎస్సార్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు. 
నెల్లూరులో...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు నెల్లూరు రూర‌ల్ నియోజ‌కవ‌ర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌థ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. గూడురు ట‌వ‌ర్‌క్లాక్ సెంట‌ర్‌లో వైఎస్సార్‌సీపీ జెండాను ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌, ఎల్ల‌సిరి గోపాల్‌రెడ్డిలు ఆవిష్క‌రించారు.
Back to Top