అవినీతి సొమ్ముల‌కు విదేశీ బ్రాంచీలు

హైద‌రాబాద్‌) ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అవినీతి చేసి, దోచుకొన్న డ‌బ్బుల్ని దాచుకొనేందుకు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు విదేశాల్లో కార్యాల‌యాలు తెరుస్తున్నార‌ని వైఎస్సార్సీపీ విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి మండిప‌డ్డారు. అక్ర‌మ ఆస్తుల్ని మ‌దుపు చేసేందుకే చంద్ర‌బాబు విదేశీ పర్య‌ట‌న‌లు అని ఆయ‌న అభివ‌ర్ణించారు. హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.
 శాసన సభలో ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జగన్ ప్ర‌శ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ప‌చ్చ నేత‌ల‌పై కోల‌గ‌ట్ల మండిప‌డ్డారు. ఆంధ్రప్రదేశ్లో దోచుకో... దాచుకో పాలన సాగుతోందని ఆయ‌న ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. అందుకే ప్రజల దృష్టి మరల్చడానికే ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబుపై ఎమ్మెల్సీ కోల‌గ‌ట్ల‌ నిప్పులు చెరిగారు. 
రైతులు, డ్వాక్రా మ‌హిళ‌ల రుణ‌మాఫీ కోసం నిధులు లేవంటున్నార‌ని, నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు క‌ల్పించేందుకు అదే కార‌ణం చెబుతున్నార‌ని కోల‌గ‌ట్ల నిల‌దీశారు. పెట్టుబ‌డుల‌కు అనువైన వాతావ‌ర‌ణం లేకుండా చేశార‌ని చంద్ర‌బాబు నిర్వాకాన్ని ఆయ‌న తేట‌తెల్లం చేశారు. 
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాకుండా కాకమ్మ కబుర్లు చెబుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Back to Top