సంజీవరెడ్డి జయంతి సందర్భంగా అన్నదానం

కణేకల్లు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రిటైర్డ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్ దివంగ‌త‌ పీ.సంజీవరెడ్డి 62 జయంతి పురష్కరించుకొని ఆయన భార్య పీ.సువర్ణమ్మ, కుమారుడు పీ.సృజన్‌రెడ్డిలు బుధవారం అన్నదానం చేశారు. స్థానిక చిక్కణ్ణేశ్వరస్వామి కళ్యాణమండ‌పంలో జరిగిన కార్యక్రమానికి రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, వైయ‌స్ఆర్ సీపీ మండల కన్వీనర్‌ ఆలూరు చిక్క‌న్న‌, సేవాదళ్‌ కన్వీనర్‌ విక్రంసింహారెడ్డి, నాయకులు కొత్తపల్లి రామ్మోహన్‌రెడ్డి, టీ.కేశవరెడ్డి, ఆర్కే టెక్సైటైల్‌ యజమాని ఆర్కే బద్రీ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top