పుష్కరభక్తులకు వైయస్సార్సీపీ అన్న సమారాధన

కృష్ణా పుష్కరాలకు విచ్చేసిన భక్తులకు  కె. కొత్తపాలెంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు. కృష్ణాకరకట్ట ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్‌ దుట్టా మోహన శివరాజయ్య మాట్లాడుతూ 2 వేల మందికి పైగా అన్న సమారాధన చేసినట్లు చెప్పారు. పుష్కర యాత్రికులతో పాటు కరకట్టపై వెళ్లే బాటసారులకు భోజనాలు వడ్డించడం జరిగిందని చెప్పారు. నియోజవకర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు, స్థానిక పీఏసీఎస్‌ అధ్యక్షుడు మత్తి వెంకట రాజాచంద్, నలుకుర్తి రమేష్, జిల్లా బీసీ కన్వీనర్‌ నాగినేని శేషగిరిరావు, జిల్లా ఎస్సీసెల్‌ ప్రధాన కార్యదర్శి లింగం జగదీష్‌కుమార్,  కోటేశ్వరావు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top