దివంగత మహానేత కు ఘన నివాళి

ఇడుపుల పాయ : ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ నాలుగురోజుల పర్యటన
వైఎస్సార్ జిల్లాలో మొదలైంది. ఇందులో మొదటగా మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. గురువారం ఉదయం ఆయన  పార్టీ నేతలతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‑‑కు
చేరుకున్నారు. మహానేత సమాధిపై పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్సార్ సమాధికి పుష్పాంజలి సమర్పించారు. వైఎస్
జగన్  వెంట ఎంపీ అవినాష్‌రెడ్డి, పార్టీ
కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జిల్లా
అధ్యక్షుడు ఆకెపాటి అమర్‌నాథ్‌రెడ్డి, సంబటూరి
ప్రసాదరెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం  ఆయన వేముల
మండలం కొన్‌రెడ్డిపల్లెకు వెళ్లారు.

Back to Top