తెలుగుతల్లి, శ్రీరాములు, వైయస్‌లకు పుష్పాంజలి

హైదరాబాద్, 26 అక్టోబర్ 2013:

సమైక్య శంఖారావం వేదికపై ఏర్పాటు చేసిన తెలుగు తల్లి, పొట్టి శ్రీరాములు చిత్ర పటాలకు, మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పుష్పాంజలి ఘటించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం సభా ప్రాంగణానికి చేరుకోగానే అభివాదాలతో ఎల్బీ స్టేడియం దద్దరిల్లింది. సభకు చేరుకున్న ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ వేదికపైకి వెళ్లారు.

ఈ సందర్భంగా శ్రీ జగన్ను కలిసేందుకు..‌. ఆయనతో కరచాలనం చేసేందుకు పలువురు పోటీ పడటంతో వారిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రం నలుమూలల నుంచీ తరలి వచ్చిన జన సందోహంతో ఎల్బీ స్టేడియం కిక్కిరిసి పోయింది. సభా ప్రాంగణం లోపలికి వెళ్లలేకపోయిన ప్రజలు ఎల్ఈడీల వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు.

Back to Top