నివాళిఅర్పించిన వైయస్ జగన్

హైదరాబాద్)) జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిలకు ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ నివాళి అర్పించారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల చిత్రపటాలకు వైయస్ జగన్ పుష్పమాలలు వేశారు. అనంతరం పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు నల్లా సూర్యప్రకాష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. 
Back to Top