దమ్మిడి సాయం కూడా అందడం లేదు

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వయంత్రాంగం పూర్తిగా విఫలమైంది. కుండపోత వర్షాలతో పంటలు, ఇళ్లు దెబ్బతిని కట్టుబట్టలతో ప్రజలు రోడ్డున పడితే..ఆదుకోకుండా చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వరద బాధితులకు అండగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ వరద ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దెబ్బతిన్న పంటలు, ఇళ్లు పరిశీలిస్తూ బాధితుల్లో భరోసా కల్పిస్తున్నారు. నిన్నటివరకు నెల్లూరు, చిత్తూరు,వైఎస్సార్ జిల్లాలో పర్యటించిన జననేత...ఇవాళ్టి నుంచి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. 

గత 15 రోజులుగా పనులకు వెళ్లలేని పరిస్థితుల్లో తిండితిప్పలు లేక బాధితులు అల్లాడుతుంటే..చంద్రబాబు అధికారులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాన్, కరవు బాధితులను ఆదుకోవడం మానేసి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణ సాయం కింద ప్రతి ఇంటికి రూ. 5వేలు చెల్లించడంతో పాటు సరుకులు పంపిణీ చేయాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
Back to Top