ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం

వైఎస్ జగన్ రెండ్రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నిన్న చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించిన వైఎస్ జగన్.. కుండపోత వర్షాలతో సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించి ధైర్యం నింపారు. ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.  దెబ్బతిన్న పంటలు, ఇళ్లను వైఎస్ జగన్ పరిశీలించారు. ప్రభుత్వం తమకు ఎలాంటి సాయం అందించడం లేదని తమ బతుకులు దుర్భరంగా మారాయని బాధితులు జననేతకు మొరపెట్టుకున్నారు. అధైర్య పడొద్దని, న్యాయం జరిగేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్ జగన్ బాధితుల్లో ధైర్యం నింపారు. 

Back to Top