ప్రభుత్వం నిర్లక్ష్యంతో బాధితుల బతుకులు దుర్భరం

ఇప్పటికీ నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో వందలాది కుటుంబాలు దుర్భర జీవనం గడుపుతున్నాయి. భారీ వర్షాల ధాటికి ఇంకా ఇళ్లన్నీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతన్న కుదేలయిపోయాడు. తినడానికి తిండిలేదు.., కట్టుకోవడానికి బట్టలేదు..తలదాచుకోవడానికి గుడిసె లేక సాయమో రామచంద్రా అంటూ బాధితులు చేస్తున్న ఆర్తనాదాలు ప్రభుత్వ పెద్దల చెవికి ఎక్కడంలేదు. ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే. అడుగడుగునా వైఫల్యమే. సాయం చేయడంలోనూ స్వార్థమే కనిపిస్తోంది.

బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బాధితులు తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు. వైఎస్ జగన్  ఎవర్ని పలకరించినా ఒకటే ఆవేదన. సహాయ చర్యలు అందలేదు.. అధికారులు కన్నెత్తి చూడడంలేదని. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఎవరో ఒకరు చుట్టపు చూపుగా వస్తున్నారు తప్ప...తమకు ఎలాంటి సహాయం చెేయడం లేదని వరద బాధితులు కన్నీటిపర్యంతమవుతున్నారు. 15 రోజులుగా వర్షాలతో ప్రజలు అనేక అవస్థలు పడుతుంటే వారి పట్ల కనీస మానవత్వం చూపడం లేదు టీడీపీ ప్రభుత్వం. 
Back to Top