ప్రాజెక్ట్ లలో జలకళ ..అంతా మహానేత చలవే

వైఎస్సార్ జిల్లాః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి రాయచోటి నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న పంటలు పరిశీలించారు. భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణనష్టం జరిగిందని ,బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

కరువు నియోజకవర్గమైన రాయచోటిలో భారీ వర్షాలతో ప్రాజెక్ట్ ల్లో జలకళ సంతరించుకోవడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   కరవుతో అల్లాడుతున్నస్థానిక ప్రజలకు నీరు అందించాలన్న ఉద్దేశ్యంతో..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా అక్కడ ప్రాజెక్ట్ లను నిర్మించారు. కుండపోత వర్షాలతో రిజర్వాయర్ లలో పెద్ద ఎత్తున నీరు వచ్చిచేరుతోంది. అందులో స్టోరయ్యే ప్రతినీటి బొట్టు మహానేత చలవేనని ప్రజలంతా తలచుకుంటున్నారని నేతలు తెలిపారు.

Back to Top