ఆలయ ప్రాంగణంలో ఫ్లెక్సీలను నిషేదించాలి

నెల్లూరు రూరల్‌: దేవాలయాల ప్రాంగణాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీల ఏర్పాటును నిషేదించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. వచ్చే నెల 4వ తేది నుంచి 14వ తేది వరకు జరిగే నరసింహకొండ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. దేవాలయం ప్రాంగణం వద్ద ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చూడాలన్నారు. ఆలయాల వద్ద ఫ్లెక్సీలు కడితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. వీఐపీ దర్శనాల పేరుతో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేయాలన్నారు. 

Back to Top