వైఎస్సార్ సీపీ కార్యాల‌యంలో స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు

హైద‌రాబాద్‌) స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్ని వైఎస్సార్సీపీ ఘ‌నంగా నిర్వ‌హించింది. హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మువ్వ‌న్నెల జెండా ఎగుర‌వేశారు. జెండాకు వంద‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా స్వాతంత్ర్య స‌మ‌ర యోధుల ఫోటోల‌కు పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర్యోద్య‌మ స్ఫూర్తిని స్మ‌రించుకొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రాల్లోని వైఎస్సార్‌సీపీ కార్యాల‌యాల్లో స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్ని జ‌రుపుకొన్నారు. 
Back to Top