నెల్లూరులో పతాకావిష్కరణ చేసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి


నెల్లూరు:  గణతంత్ర దినోత్సవం సందర్భంగా వైయస్ ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి  నెల్లూరు జిల్లా ఓజిలి మండలం సగుటూరులో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకున్న మహనీయులను సేవలను స్మరించుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గణతంత్ర దినోత్సవ  శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ధ పాలనను నిలబెట్టడంతోపాటు సౌరహక్కులను పరిరక్షిండంలో సామాజిక న్యాయాన్ని అందించడంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించిందని అన్నారు. పార్టీ సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి , కాకాని గోవర్దనరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Back to Top