వైయ‌స్ఆర్‌సీపీకి మ‌ద్ద‌తు వెల్లువ‌


ఢిల్లీ: ప‌్ర‌త్యేక హోదాపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొన‌సాగుతోంది. పార్ల‌మెంట్లో ప్ర‌త్యేక హోదాపై చ‌ర్చించాల‌ని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ అవిశ్వాస‌తీర్మానం ప్ర‌వేశ‌పెట్టింది. ఈ తీర్మానానికి ఐదు పార్టీలు మ‌ద్ద‌తుగా నిలిచాయి. ఇదే అంశంపై వైయ‌స్ఆర్‌సీపీతో పాటు కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం, ఆర్ఎస్‌పీలు అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో ఆరు రోజులుగా స‌భ‌ను స్పీక‌ర్ వాయిదా వేశారు. ఇవాళ అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు పార్ల‌మెంట్‌కు బ‌య‌లుదేరారు.
Back to Top