వైయస్‌ జగన్‌తోనే మత్స్యకారుల అభివృద్ధి

  • జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌ కల్పించేలా చర్యలు
  • వైయస్‌ఆర్‌ సీపీని గెలిపిస్తే 144 కులాలకు న్యాయం
  • మత్స్యకారుల దీక్షలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే మత్స్యకారుల సమస్యను పరిష్కరించగలరని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. తమను ఎస్టీలో చేర్చాలని మత్స్యకారులు 28 రోజులుగా విశాఖలో దీక్షలు చేస్తున్నారు. మత్స్యకారుల దీక్షకు ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టికల్‌ 331, 332 ప్రకారం ఆంధ్రరాష్ట్రలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7 శాతం, ముస్లింలకు 4 శాతం మొత్తం 26 శాతం రిజర్వేషన్‌లను కల్పించడం జరిగిందన్నారు. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడేందుకు బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పారు. ఆ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15, 16 ప్రకారం మత్స్యకారుల సోదరులందరికీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌లు చట్టసభల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పించాలని పొందుపర్చనున్నామన్నారు. 

15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా..?

ఆంధ్రరాష్ట్రంలో మత్స్యకారుల జనాభా 8 శాతం ఉందని, జనాభా ప్రాతిపదికన ప్రకారం 14 సబ్‌ కేటగిరిలను కలుపుకొని 15 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉండాలన్నారు. రాష్ట్రం పుట్టిననాటి నుంచి ఇప్పటి వరకు 15 మంది మత్స్యకారులు ఎమ్మెల్యేలుగా ఉన్నారా అని ప్రశ్నించారు. అలాంటి పరిస్థితి తీసుకురావాలంటే జనాభా ప్రాతిపదికనపై రిజర్వేషన్‌ కల్పించాలని, అందుకు రాజ్యాంగ సవరణ జరగాలన్నారు. అది వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. మత్స్యకారుల హక్కుల సాధన కోసం వైయస్‌ఆర్‌ సీపీ పోరాడుతుందన్నారు. షెడ్యుల్‌9లో ఏదైనా 50 శాతానికి మించిన రిజర్వేషన్‌ పొందిపరిస్తే చట్టబద్ధం అవుతుందని, అది జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే చేయగలరన్నారు. వైయస్‌ఆర్‌ సీపీని గెలిపించి అధికారంలోకి తీసుకురండి.. న్యాయం జరుగుతుందని మత్స్యకారులకు సూచించారు. ఒక్క మత్స్యకారులకే కాకుండా ఏపీలో 144 వెనుకబడిన కులాలకు న్యాయం జరగాలంటే వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రావాలన్నారు.  
Back to Top