చేపలు పట్టాలంటే టీడీపీ నేతల అనుమతి తీసుకోవాలి


చిత్తూరు: టీడీపీ నేతల అనుమతి తీసుకుంటేనే చేపలను పట్టనిస్తున్నారని మత్స్యకారులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కోబాకలో వైయస్‌ జగన్‌ మత్స్యకారులను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జననేతను కలిసి మత్స్యకారులు మీడియాతో మాట్లాడుతూ.. మాకు ఇళ్ల పట్టాలు, రేషన్, ఆధార్‌ కార్డులు కూడా లేవు, పొద్దున నుంచి సాయంత్రం వరకు చేపలు పడితే.. రూ. 100 వస్తాయి.. వాటితో మా కుటుంబాలు ఎలా బతకాలి. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మా సమస్యలన్నీ వైయస్‌ జగన్‌కు చెప్పుకున్నాం.. అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారని వారు చెప్పారు. 
 
Back to Top