వైయ‌స్ జ‌గ‌న్‌కు సినీన‌టుడు వెంక‌ట్ మ‌ద్ద‌తు

విశాఖ‌: జన క్షేమమే తన క్షేమమంటూ జననేత వేస్తోన్న ప్రతి అడుగూ కష్టాల కడలిని ఎదురీదుతున్న ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. రేపటి ఆశలకు ఊపిరులూదుతోంది. కష్టాలతో కాలం గడుపుతున్న ప్రజలకు నేనున్నానంటూ వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు వివిధ వ ర్గాల నుంచి మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది. సినీ రంగానికి చెందిన ప‌లువురు న‌టులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి ఇదివ‌ర‌కే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. తాజాగా సినీ న‌టుడు పిష్‌ వెంక‌ట్ వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి సంఘీభావం తెలిపారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం వైయ‌స్‌ జగన్‌.. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. మార్గ‌మ‌ధ్య‌లో వెంక‌ట్ వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి మ‌ద్ద‌తు తెలిపి..కొంత దూరం అడుగులో అడుగేశారు. వైయ‌స్ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు. 
Back to Top