మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం

()పుష్కరాల్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు అండగా వైయస్సార్సీపీ
()ఇటీవలే బాధిత కుటుంబాలను పరామర్శించిన వైయస్ జగన్
()వైయస్సార్సీపీ తరపున రూ.లక్ష ఆర్థికసాయం

చందర్లపాడు: పుష్కర స్నానాలకెళ్లి మృతిచెందిన ఐదుగురు విద్యార్థుల కుటుంబాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేతలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడుకు చెందిన ములకలపల్లి హరీశ్, నందిగామ మండలం చెరువుకొమ్ముపాలెంకు చెందిన పాశం గోపిరెడ్డి, నందిగామకు చెందిన కమ్మవరపు హరిగోపి, కూచి లోకేశ్, వీరులపాడు మండలం జయంతి గ్రామవాసి నందిగామ నగేష్‌లు ఇటీవల గుంటూరు జిల్లాలోని దిడుగు గ్రామం వద్ద పుష్కరస్నానాలకు వెళ్లి మృత్యువాత పడడం తెలిసిందే.

కాగా పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, రాష్ట్ర కార్యదర్శి అరుణ్‌లు  మృతుల కుటుంబాలను కలసి వైయస్సార్‌సీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం ఈ ఆర్థికసాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు.

ప్రభుత్వం పబ్లిసిటీ పిచ్చి, ఇసుక మాఫియా కారణంగా ఐదుగురు విద్యార్థులు పుష్కర స్నానికి వెళ్లి మృత్యువాత పడ్డారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బాధితులకు అండగా నిలిచారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. అన్యాయంగా విద్యార్థుల ప్రాణాలను బలితీసుకున్న ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అదే సమయంలో ఆకుటుంబాలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ఈమేరకు బాధిత కుటుంబాలకు వైయస్సార్సీపీ తరపున ఆర్థికసాయం అందించారు. ప్రతీ కుటుంబానికి రూ. 20 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top