అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆర్థికమంత్రి అరాచకత్వం

తునిః అధికారాన్ని అడ్డం పెట్టుకొని  రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడు సాగిస్తున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. తుని మండలం చామవరం శివారులో ఆదివారం రాత్రి జరిగిన వైయస్సార్‌ సీపీ తుని నియోజకవర్గ ప్లీనరీకి ఆయన అధ్యక్షత వహించారు. తొలుత దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి, మాజీ మంత్రి, సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ... 2004కు ముందు టీడీపీకి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించుకునే అవకాశం ప్రతిపక్షాలకు ఉండేది కాదన్నారు. ఇప్పుడు గుండెధైర్యంతో ఎక్కడైనా ఎప్పుడైనా సభలు నిర్వహించుకునే అవకాశాన్ని ప్రజలు కల్పించారన్నారు.

Back to Top