అంతిమంగా ధర్మమే గెలుస్తుంది

  • అన్యాయం, అధర్మం తాత్కాలికమే
  • మోసాలు చేస్తున్న చంద్రబాబును ప్రశ్నించకూడదట
  • నిరుపేదలు, రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను బతకనివ్వడం లేదు
  • మోసం చేసేవాడు కావాలా.. మాట మీద నిలబడే వ్యక్తి కావాలా
  • చంద్రబాబు మోసపూరిత పాలనకు బుద్ధిచెబుదాం
  • న్యాయం, ధర్మంవైపు నిలబడదాం..వైయస్సార్సీపీని ఆశీర్వదించండి
  • యాలూరులో వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం
నంద్యాల: ఎడమ చేత్తో ప్రజల జేబుల్లోంచి డబ్బులు లాక్కొని కుడిచేత్తో వాటిని మళ్లీ ఆ ప్రజలకే ఇచ్చే వ్యక్తి చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నిరుపేదలు, రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను బతకనివ్వకుండా చేస్తున్నాడని మండిపడ్డారు. నంద్యాల ప్రచారంలో భాగంగా యాళ్లూరు రోడ్‌ షోలో జననేత మాట్లాడుతూ... ఎన్నికల ముందు ఏ టీవీ చూసినా, ఏ గోడ చూసినా రుణమాఫీ, బ్యాంక్‌లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కనిపించేవన్నారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులు, డ్వాక్రా సంఘాల మహిళల జీవితంగా సర్వనాశనం అయ్యిందన్నారు. రైతులకు రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తామన్నాడు. కానీ ఈ రోజుకు కూడా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేదన్నారు. ఆ నిధి ఏమైందని రైతులు ప్రశ్నిస్తే మీరంతా వైయస్‌ జగన్‌ మనుషులని కళ్లు పెద్దవి చేసి అక్రమంగా రైతులను చంద్రబాబు అరెస్టు చేస్తున్నాడన్నారు. 

 చదవుకునే పిల్లలను కూడా ఓటు బ్యాంక్‌ కోసం మార్చుకున్న నీచమైన వ్యక్తి చంద్రబాబు అని వైయస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. జాబు రావాలంటే బాబు రావాలని.. లేకపోతే ఇంటింటికీ నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేశాడన్నారు. ఇప్పటి వరకు 38 నెలలు గుస్తున్నా.. ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. చంద్రబాబు ప్రతి కుటుంబానికి రూ. 76 వేలు బాకీ పడ్డారన్నారు. పేదవారికి ఇళ్లు కట్టిస్తానన్నబాబు, ఈ మూడేళ్ల కాలంలో ఒక్క ఇల్లు అయినా కట్టించాడా అని వైయస్‌ జగన్‌ ప్రజలను అడిగారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు రేషన్‌ దుకాణాల్లో 9 సరుకులు ఇచ్చే వారని, కానీ ఇప్పుడు బియ్యం తప్ప మరేమైనా ఇస్తున్నారా అని అడిగారు. 

ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తరువాత చంద్రబాబు మొదటి సారి ఆగస్టు 15న మూడేళ్ల క్రితం కర్నూలు వచ్చి మైక్‌ పట్టుకొని ఇచ్చిన వాగ్ధానాల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. కర్నూలుకు ఎయిర్‌పోర్టు, ఉర్దూ యూనివర్సిటీ, స్మార్ట్‌ సిటీ, ట్రిపుల్‌ ఐటీ, సూపర్‌ స్పెషాల్టీ ఆసుపత్రి, రైల్వే మరమ్మతుల ఫ్యాక్టరీ, మైనింగ్‌ స్కూల్, ఫుడ్‌ పార్క్, అవుకు దగ్గర ఇండస్ట్రీయల్‌ సిటీ, ఆధోని టెక్స్‌టైల్‌ క్లస్టర్లు అన్నాడు. చివరకు రైతులను మోసం చేయడానికి గుండ్రేవుల ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు చెప్పిన మాటలు వీటిల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రజలు అడిగారు. ఇంత దారుణంగా పరిపాలన చేస్తున్న చంద్రబాబుకు నంద్యాలలో ఉప ఎన్నికలు రాగానే ప్రజలు గుర్తుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ టేపు రికార్డర్‌ ఆన్‌ చేసి నంద్యాలకు అది చేస్తా.. ఇది చేస్తానంటూ కొత్త రాగం పాడుతున్నాడన్నారు.  ఇలాంటి మోసాలు చేస్తున్న చంద్రబాబును ప్రశ్నించకూడదట. ఏ ఒక్క సామాజిక వర్గాన్నైనా చంద్రబాబు మోసం చేయకుండా వదిలిపెట్టారా.. ప్రతి వారిని మోసం చేశారన్నారు. ప్రశ్నిస్తే రాష్ట్రమంతా వైయస్‌ జగన్‌ దిష్టిబొమ్మలు కాల్చండి అంటూ తానే తన ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఫోన్‌ చేసి చెబుతున్నాడన్నారు. 

ఇంత దారుణంగా మోసం చేసే వ్యక్తికి ఏ శిక్ష విధించినా తప్పేమైనా ఉందా.. ఇలాంటి వ్యక్తికి ఉరి శిక్ష విధించినా తప్పే లేదన్నారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్‌ ఏది చదివినా వాటిల్లో సారాంశం ఒక్కటే.. అన్యాయం, అధర్మం తాత్కాలికంగా గెలుస్తాయి. చివరకు ధర్మం మాత్రమే గెలుస్తుందన్నారు. ఏ సినిమాకు వెళ్లినా 13వ రీల్‌ వరకు హీరో దెబ్బలు తింటూనే ఉంటాడని, చివరకు హీరోనే గెలుస్తాడన్నారు. టికెట్‌ కొని సినిమాకు వెళ్లిన వారికి హీరో గెలవాలని ఉంటుందా.. విలన్‌ గెలవాలని ఉంటుందా అని ప్రజలను అడిగారు. మీకు హీరో కావాలా.. విలన్‌ కావాలా.. మోసం చేసేవాడు కావాలా.. మాట మీద నిలబడే వ్యక్తి కావాలా అని నంద్యాల ప్రజానికాన్ని అడిగారు. నంద్యాలలో ఉప ఎన్నికలు ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసుకోవడం కోసం జరగడం లేదని, మూడేళ్ల మోసాలకు బుద్ధి చెప్పేందుకు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి ఎన్నికల్లో న్యాయం, ధర్మం వైపు ప్రజలంతా నిలబడాలన్నారు. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోతుందని యాళ్లూరు రైతు మోహన్‌ అన్నారు. ప్రచార రథంపైకి వైయస్‌ జగన్‌ ఆ రైతును పిలిపించి మాట్లాడించారు. నా రుణాలు మాఫీ కాలేదని మోహన్‌ చంద్రబాబును నిలదీశాడని చెప్పారు. మోహన్‌కు రూ. 70 వేల అప్పు ఉంటే సంవత్సరానికి రూ. 15 వేలు రెండేళ్లుగా 30 వేలు వడ్డీలే కట్టానని మోహన్‌ అన్నారు. చంద్రబాబు చేసిన మాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. Back to Top