'ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయ౦డి'

హైదరాబాద్: తెలంగాణలో ఖాళీగా ఉన్న 25 వేల ప్రభుత్వ ఉపాధ్యాయపోస్టులను భర్తీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్ డిమాండ్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రేషనలైజేషన్‌తో సంబంధం లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతున్నా హస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచలేదని పేర్కొన్నారు. ఆనాడు దివంగత సీఎం వైఎస్సార్ విద్యా శాఖకు ఇచ్చిన నిధులను ఒక ఖర్చుగా చూడలేదన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
Back to Top