ప్ర‌త్యేక హోదా వ‌చ్చేదాకా ఉద్య‌మం

వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్‌నాథ్‌
విశాఖ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా వ‌చ్చే వ‌ర‌కు ఉద్య‌మిద్దామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్‌నాథ్ పిలుపునిచ్చారు. శుక్ర‌వారం విశాఖ‌లో నిర్వ‌హించిన ఆంధ్రుల హ‌క్కుల ఆత్మ‌గౌర‌వ దీక్ష‌కు ఆయ‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా అమ‌ర్‌నాథ్ మాట్లాడుతూ..ఎన్నిక‌ల ముందు ప‌దిహేనేళ్లు ప్ర‌త్యేక హోదా కావాల‌ని డిమాండ్ చేసిన చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక మాట త‌ప్పార‌ని మండిప‌డ్డారు. కేంద్రం విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను నీరుగార్చింద‌న్నారు. హోదా సాధ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నార‌ని చెప్పారు. ఈ దీక్ష‌లో వైయ‌స్ఆర్‌సీపీ  విశాఖ తూర్పు నియోజకవర్గం కన్వీనర్ వంశీకృష్ణ‌ శ్రీనివాస్‌, కోలా గురువులు , తిప్పల నాగిరెడ్డి , కొయ్య ప్రసాద్ రెడ్డి  ,హనోకు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

స్పీక‌ర్ వ్యాఖ్య‌ల‌పై మ‌హిళ‌ల ఆందోళ‌న‌
విశాఖ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ మ‌హిళ‌ల‌పై చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌పై విశాఖ మ‌హిళ‌లు మండిప‌డ్డారు. శుక్ర‌వారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌హిళా విభాగం ఆధ్వ‌ర్యంలో విశాఖ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద న‌ల్ల చీర‌లు ధ‌రించి నిర‌స‌న తెలిపారు. స‌భాప‌తి స్థానంలో ఉన్న వ్య‌క్తి మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేయ‌డం బాధాక‌ర‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ సిటీ మహిళా అధ్యక్షురాలు ఉషా కిరణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


Back to Top