ప్రత్యేకహోదా వచ్చే వరకు పోరాటం

టీడీపీ, బీజేపీల మెడలు వంచుతాం
రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించుకుంటాం
హోదా సాధనే లక్ష్యంగా వైయస్సార్సీపీ ఉద్యమం

తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీ నడివీధుల్లో తాకట్టుపెట్టాడని వైయస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మండిపడ్డారు. బీజేపీ హోదా ఇవ్వమని తెగేసి చెప్పినా కూడా చంద్రబాబు వారికి వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు. ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఢిల్లీలో ధర్నాలు చేసినప్పుడు, గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడే ప్రభుత్వం స్పందించి ఉంటే ఇవాళ ఈపరిస్థితి వచ్చేది కాదన్నారు.  తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అధ్యక్షులు వైయస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ప్రజలంతా ఆయనకు మద్దతుగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిస్తేనే తెలుగువారికి న్యాయం జరుగుతుందని కన్నబాబు చెప్పారు. 

నయవంచన చేయడమే టీడీపీ నైజమని, టీడీపీ ప్రజాద్రోహుల పార్టీ అని  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు తన కుల దైవ‌మైన వెంక‌టేశ్వ‌ర‌స్వామి పాద‌పీఠికల సాక్షిగా  తిరుప‌తిలో 15 సంవ‌త్స‌రాలు ప్ర‌త్యేక హోదా కావాల‌ని న‌రేంద్ర మోదీకి విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారని, అధికారంలోకి  వ‌చ్చాక  హోదాను విస్మరించారని మండిపడ్డారు. ప్ర‌త్యేక హోదా వ‌ల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్ర‌యోజ‌నాలు లేవని మాట్లాడుతున్న బాబుకంటే దుర్మార్గుడు మరొకరు ఉండ‌ర‌ని కరుణాక‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు. ఓటుకు నోటు కేసులో జైలుకు పోవాల్సి వస్తుందన్న భ‌యంతోనే బాబు ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేదని మాట్లాడుతున్నారని ఫైరయ్యారు.  ప్ర‌త్యేక హోదా కావాల‌ని ప్ర‌జ‌లు చేస్తున్న ఆగ్ర‌హాజాల్వ‌ల నుంచి త‌ప్పించుకోవ‌డానికే బాబు విదేశీ యాత్రలకు వెళ్లారని దుయ్యబట్టారు. బాబు మోడీ ప్రభుత్వానికి లొంగిపోయారని విమర్శించారు. ఓ పక్క  వైయస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేస్తుంటే... చంద్ర‌బాబు ఎమ్మెల్యేలను ఎలా కొందామా అన్న ధ్యాసలో ఉండడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. 

రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌స్తేనే మ‌న పిల్ల‌ల భ‌విష్య‌త్తు బాగు ప‌డుతుంద‌ని వైయస్సార్సీపీ నేత జోగి ర‌మేష్ అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క‌లెక్ట‌రేట్ ముట్ట‌డికి పిలుపు ఇచ్చిన సందర్భంగా జిల్లా ప్ర‌జ‌లు భారీ ఎత్తున క‌లెక్ట‌రేట్ వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా జోగి ర‌మేష్ మాట్లాడుతూ... రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల‌తో విదేశీ పర్య‌ట‌న‌లు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృధ్ధి చెందాలంటే ప‌దేళ్లు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న బీజేపీ ఈ రోజు మాట మార్చ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు పార్థ‌సార‌ధి అన్నారు. బీజేపీ టీడీపీతో కుమ్మ‌క్కై ఆంధ్రరాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తుంద‌ని ఆగ్రహించారు.  ప్ర‌త్యేక హోదా విష‌యంలో టీడీపీ చేత‌గానీ త‌నం, అస‌మ‌ర్థ‌త ఏంటో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ అర్థ‌మైంద‌న్నారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా తీసుకురావడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్ర‌తిఒక్క‌రం నిరంత‌రం పోరాడ‌తామ‌ని, అవ‌స‌ర‌మైతే ప్రాణాల‌కు సైతం తెగిస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామ‌ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న చెప్పారు.  ఇది కేవ‌లం ప్రారంభం మాత్ర‌మేన‌ని అన్నరు.  కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల బండారం ప్ర‌జ‌ల ముందు ఉంచుతామ‌ని క‌ల్ప‌న పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నింటినీ క‌లుపుకొని కేంద్రంపై ఒత్త‌డి తీసుకొచ్చి ప్ర‌త్యేక హోదాను సాధిస్తామ‌ని క‌ల్ప‌న వివ‌రించారు. 

To read this article in English:  http://bit.ly/1Wn9xQX 

Back to Top