రైల్వే జోన్ సాధనే ధ్యేయంగా ఉద్యమం

విశాఖపట్నంః విశాఖకు రైల్వే జోన్ సాధనే లక్ష్యంగా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. అమర్నాథ్ దీక్షకు సంఘీభావంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. టీడీపీ, బీజేపీ మినహా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, విద్యార్థి సంఘాలు, మేధావులు అమర్నాథ్ దీక్షకు మద్దతు పలికారు. 

రైల్వేజోన్ కోసం అమర్నాథ్ చేస్తున్న పోరాటానికి పార్టీ యావత్తు అండగా నిలుస్తుందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేద్దామని గుడివాడ అమర్‌నాథ్‌కు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అమర్‌నాథ్‌తో జననేత ఫోన్‌లో మాట్లాడారు. దీక్షకు మద్దతుగా రాష్ట్ర పార్టీ తరఫున ఎంపీల బృందాన్ని పంపుతామని చెప్పారు. విశాఖపట్నం రైల్వేజోన్ సాధనే పార్టీ ధ్యేయమని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. 
Back to Top