ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుదాం

కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
కురుపాం: ప‌్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుదామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్ప‌శ్రీ‌వాణి పిలుపునిచ్చారు. చినమేరంగి గ్రామంలో కురుపాం మండలానికి చెందిన వైయ‌స్ఆర్‌ సీపీ కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా పుష్పశ్రీవాణి  మాట్లాడుతూ గ్రామానికి ఇద్దరు చొప్పున కార్యకర్తలను ఎంపికచేసి వారితో గ్రామంలో సమస్యలు తెలుసుకొని పోరాటానికి సిద్ధం కావాల‌న్నారు. ఇద్దరు చురుకైన కార్యకర్తలను ఎంపికచేసిన గ్రామంలో ఉన్న పింఛన్లు, తెల్లరేషనుకార్డులు, సీసీరోడ్లు తదితర సమస్యలు ముందుగానే గుర్తించి వాటిపై పోరాటం చేయడానికి కార్యకర్తలను సమాయత్తం చేయడానికి సమావేశం ఏర్పాటుచేసామని తెలిపారు. ప్రతి గ్రామంలోను చాలా అక్రమాలు జరుగుతున్నాయని వాటిని ముందుగానే గుర్తించాలని అన్నారు.ప్రతి కార్యకర్త కష్టించి పనిచేయాలని రానున్న రోజులు మనవేనని అన్నారు. స‌మావేశంలో కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, ఎంపీపీ ఆనిమి ఇందిరాకుమారి,  జిల్లా నాయకులు శెట్టి నాగేశ్వరరావు, కురుపాం మండల కన్వీనర్‌ ఇంటికొప్పుల గౌరీశంకర్, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయితీ పెద్దలు  పాల్గొన్నారు.

Back to Top