ప్రజాసమస్యల కోసం పోరాడుతా

ఖమ్మం:

 అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యల కోసం పోరాడుతానని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి, మల్లారం, కమలాపురం గ్రామాల్లో సీసీ రోడ్ల శంకుస్థాపనకు విచ్చేసిన ఎంపీ పొంగులేటికి ప్రజలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం జరిగిన సభలో ఎంపీ మాట్లాడుతూ.. 14వ ఫైనాన్స్ నిధుల నుంచి 41 శాతం ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది తప్ప అవి సామాన్య ప్రజానీకానికి ఏమాత్రం సరిపోవడం లేదన్నారు.  తెలంగాణ రాష్ట్రం వస్తే  మేలు జరుగుతుందని అనుకున్న తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతోందన్నారు.

Back to Top