ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుదాం

నెల్లూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేద్దామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావ‌లి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్ర‌తాప్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం  కావలి ప‌ట్ట‌ణంలోని 13వార్డు నాయకులతో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా వార్డులోని సమస్యల మీద చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక అభివృద్ధికి నిధులు కేటాయించ‌డం లేద‌ని, ప్ర‌చార ఆర్భాటాల‌కు ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. ఇటీవ‌ల తాను ఏ గ్రామం వెళ్లినా కూడా ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు మొర‌పెట్టుకుంటున్నార‌ని తెలిపారు. సంక్షేమ ప‌థ‌కాలు ప‌చ్చ చొక్కాల‌కే ప‌రిమిత‌మ‌య్యాయ‌ని ఆరోపించారు. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌వాల‌ని, మ‌రో రెండేళ్ల‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవుతార‌ని చెప్పారు. 
Back to Top