పొగాకు రైతుల స‌మ‌స్య‌ల‌పై డిల్లీలో పోరాటం


న్యూఢిల్లీ) ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన‌ప్పుడు అనేక చోట్ల పొగాకు రైతులు ఆయ‌న్ని క‌లిశారు. గిట్టుబాటు ధ‌ర లేక ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్ని ఆయ‌న దృష్టికి తీసుకొని వ‌చ్చారు. పొగాకు రైతుల‌కు అండ‌గా వైఎస్సార్‌సీపీ నిలుస్తుంద‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. వైఎస్ జ‌గ‌న్ సూచ‌న మేర‌కు రైతుల త‌ర‌పున పోరాడే బాధ్య‌త‌ను ఎంపీలు తీసుకొన్నారు. పార్ల‌మెంటు స‌మావేశాల‌కు హాజ‌రు అవుతూనే కేంద్ర మంత్రుల అపాయంట్ మెంట్ తీసుకొన్నారు. పొగాకు రైతుల స‌మ‌స్య‌ల్ని కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రి, ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకొని వ‌చ్చారు. రాష్ట్రానికి చెందిన వెంక‌య్య నాయుడు, నిర్మ‌లా సీతారామ‌న్ ల దృష్టికి తీసుకొని వ‌చ్చారు. పొగాకు రైతు స‌మ‌స్య‌ల్ని తీర్చాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది.

Back to Top