పోర్టు కోసం ప్రభుత్వాలపై పోరాడుతాం

నెల్లూరు: రామాయపట్నం పోర్టు సాధనకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కావలి నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటుందని మండిపడ్డారు. పోర్టుకు రామాయపట్నం అనువైన ప్రాంతం అని నిపుణుల బృందం నివేదిక ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. పోర్టుతోనే కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. చంద్రబాబు సర్కార్‌ పోర్టును వేరే చోటుకు తరలించడానికి కుట్రలు చేస్తుందని విమర్శించారు. రామాయపట్నంలో పోర్టును నిర్మించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామన్నారు.

తాజా ఫోటోలు

Back to Top