బాబు కుట్రలపై తిరుగుబాటుః పేర్ని నాని

విజయవాడ:  చంద్రబాబు భూ దాహం మితిమీరిపోయిందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పేర్ని నాని విమర్శించారు. పోర్టు పరిశ్రమల పేరుతో లక్షా ఐదు వేల ఎకరాలు భూములు అమ్ముకునేందుకు...మచిలీపట్నం మండలంలోని 34 గ్రామాలు లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. బాబు తలకిందులుగా తపస్సు చేసినా రైతులు ఒక్క ఎకరం భూమి కూడా ఇవ్వరని చెప్పారు.

జైలు కైనా వెళ్తాం. ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇచ్చేది లేదన్నారు. పోర్టుకు అవసరమైన 4,800 ఎకరాల భూమి ఇవ్వడానికి రైతులు సిద్ధమని, అంతకుమించి ఒక్క ఎకరం కూడా తీసుకోవడానికి వీల్లేదన్నారు. అందులో కూడా రైతులకు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించి భూములు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోర్టు భూముల విషయంలో చంద్రబాబుపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
Back to Top