ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌పై పోరాడదాం

  • ఆక్వాపార్కు విష‌యంలో మ‌హిళ‌ల‌పై దౌర్జ‌న్య‌కాండ‌
  • మూడేళ్ల‌లో ఒక్క ఇల్లు అయినా క‌ట్టించారా.. బాబూ?
  • వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌.గో జిల్లా అధ్య‌క్షుడు ఆళ్ల నాని
నరసాపురం: చంద్రబాబు చీకటి పాలనకు ఇంకా రెండేళ్ల స‌మ‌య‌మే మిగిలుంద‌ని, ప్రభుత్వం సాగిస్తున్న ప్ర‌జావ్య‌తిరేక పాల‌న పోరాటాలకు సిద్ధం కావాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్ సీపీ నరసాపురం నియోజకవర్గ ప్లీనరీ సమావేశాన్ని స్థానిక అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించారు. స‌మావేశానికి ముఖ్య అతిథిగా ఆళ్ల నాని హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ చంద్రబాబు దుర్మార్గ పాలనకు నరసాపురం నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలే నిదర్శనమన్నారు. మొగల్తూరు ఫ్యాక్టరీలో కాలుష్యం కారణంగా 5 మంది కార్మికులు దుర్మ‌ర‌ణం చెందార‌న్నారు.  మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్ర‌భుత్వం అండ‌గా నిల‌వ‌కుండా ఫ్యాక్ట‌రీ యాజ‌మాన్యానికి కొమ్ముకాసింద‌ని మండిప‌డ్డారు. తుందుర్రు ఆక్వాపార్కు విషయంలో మహిళలపై సాగించిన దౌర్జన్య కాండను ప్రజలంతా గమనిస్తున్నార‌న్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ వంక రవీంద్రనాథ్‌, పార్టీ రాష్ట కార్యదర్శి, నరసాపురం ప్లీనరీ సమావేశం పరిశీలకుడు మోషేన్‌రాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకా శేషుబాబులు  మాట్లాడుతూ.. టీడీపీ స‌ర్కార్ ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌ను దిగ‌జార్చుతుంద‌ని మండిప‌డ్డారు. ప్రతిపక్షానికి కనీస గౌరవం ఇవ్వ‌డం లేద‌న్నారు. పార్టీని సంస్థాగతంగా బ‌లోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  రాష్టాన్ని అభివృద్ధి చేశామంటూ చంద్రబాబు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

మూడేళ్ల‌లో ఒక్క అభివృద్ధైనా చేశారా..?
అధికారంలో చేప‌ట్టి మూడేళ్లు పూర్త‌వుతున్నా... నియోజకవర్గంలో ప‌లానా అభివృద్ధి చేశామ‌ని చెప్ప‌గ‌ల‌రా అని పార్టీ నియోజ‌క‌వ‌ర్గ క‌న్వీన‌ర్‌, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్ర‌సాద‌రాజు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ల‌క్ష‌ల ఇళ్లు కట్టిస్తామ‌ని బీరాలు ప‌లికిన చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఇల్లు అయినా క‌ట్టించారా అని నిల‌దీశారు. దివంగత మ‌హానేత ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హయాంలో మంజూరు చేసి పాత నిధులు వస్తుంటే అవి తమ ఘనతగా టీడీపీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. పుష్కర నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు పెట్టలేని దుర్భర స్థితిలో న‌గ‌ర‌ మున్సిపాలిటీ ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వైయ‌స్ఆర్ చలవేనన్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయి బాలపద్మ, నియోజకవర్గ కన్వీనర్లు గుణ్ణం నాగబాబు, పుప్పాల వాసు, పాతపాటి సర్రాజు, కవురు శ్రీనివాస్, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడీ రాజు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 
Back to Top